ముస్తాబాద్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షులు అన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు పండుగ సంబరాలలో భాగంగా వేడుకలు సమావేశం నిర్వహించారు.సంఘంలో గల రైతులకు ఇప్పటివరకు వచ్చిన రుణమాఫీ,547 మంది రైతులకు రుణమాఫీ 4,29,54,994రూపాయలు వచ్చినవనీ అధ్యక్షులు అన్నం రాజేందర్ రెడ్డి తెలిపారు. తిరిగి 449 మంది రైతులకు 4,37 25 వేల రుణాలు ఇచ్చామని తెలిపారు.
సంఘ పరిధిలో ధాన్యం కొనుగోలులో సన్న వడ్లు 16440 క్వింటాళ్లు కొనుగోలు చేశామని రైతులకు 500 బోనస్ వచ్చిందని తెలియజేశారు. సన్నం వడ్లకు వచ్చిన బోనస్ డబ్బులతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. పెట్టుబడి సాయం ₹5000 నుండి 7500 పంట పెట్టుబడి సాయం పథకాన్ని సంక్రాంతి నుండి ప్రారంభం చేస్తారని తెలిపారు. పంట పెట్టుబడి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని,తెల్ల రేషన్ కార్డు, కుటుంబ నిర్ధారణ, ఆధార్ కార్డు తప్పిదాల వలన, బ్యాంక్ ఖాతాల పొరపాట్లు వలన కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని వాటిని సరిదిద్ది ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతు ప్రభుత్వం రైతులను లక్ష్యాధికారులను చేయుటకు కృత నిత్యంతో ఉందని తెలిపార. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు అన్నం రాజేందర్ రెడ్డి, నిమ్మల రవి,మట్ట రమణారెడ్డి, ఎల్ల యాదగిరిరెడ్డి, కొండల్ రెడ్డి, ముద్దం శ్రీనివాస్ రెడ్డి, ముద్దం భార్గవ్,బాలెళ్ళు మరియు సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.