పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, ఈనాటి ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుల పండుగ తేదీ:28.11.2024 నుండి 30:11.2024 జరుగుతుండగా, నేడు చివరి రోజు కావడంతో రైతులకు, ప్రజలకు ఏ విధమైన స్కీములు అందిస్తున్నాము. అనే దానిపై సంఘ అధ్యక్షుడు, చల్లా లింగారెడ్డి అధ్యక్షతన సంఘ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మా సొసైటీ పరిధిలో ఇప్పటివరకు, 774 మంది రైతులకు, 4.59 కోట్లు రూపాయలు మాఫీ రాగా, మరల తిరిగి 635 మందికి, 4.81 కోట్ల రూపాయలు రుణబట్వాడా చేశాము . మా సంఘంలో 60% రుణమాఫీ జరిగింది. మిగిలిన 40% కూడా త్వరలో మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, 42,450 ఎరువుల బస్తాలు ఈ సీజన్ కు అందించాము. వాటి యొక్క విలువ 1.30 కోట్ల రూపాయలు. సకాలంలో మార్క్ ఫైడ్ వారికి చెల్లించాము. వరి ధాన్యం కొనుగోలు బోనస్ తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరంలో, సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ కల్పించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జి ఎస్ టి లేని వ్యవసాయం తెలంగాణ ప్రభుత్వంలో, వ్యవసాయానికి అవసరమైన వస్తువులు కొనుగోలుపై, ఉత్పత్తుల పై జి.ఎస్.టి పన్ను తొలగింపు చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు నలమాస యాకయ్య, కత్తి కృష్ణ, మల్లేష్, రమేష్, యాకూబ్ పాషా, జయపాల్, యాకాంబరం పాల్గొన్నారు.