తొగుట మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కప్ నిరవహణపై ఎంపీడీవో ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో సీఎం కప్ నిర్వహణపై ఎంపీడీవో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. గ్రామస్థాయిలో 7, 8 తేదీల్లో కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది .
మండల స్థాయిలో 10, 11, 12 తేదీల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. కబడ్డీ మరియు కో,కో క్రీడాంశాల్లో క్రీడాకారులు ఓపెన్ టు ఆల్ ప్రకారం పాల్గొనవచ్చు. అదేవిధంగా వాలీబాల్ క్రీడాంశంలో ఒకటి 1.1.2007 రోజున పుట్టిన వారు మరియు ఆ తర్వాత పుట్టిన వారు అర్హులని తెలిపారు. కబడ్డీ క్రీడాంశంలో మహిళల విభాగంలో 75 కిలోల కంటే తక్కువ బరువు బరువును కలిగి ఉండాలి
అదేవిధంగా పురుషుల్లో 85 కిలోల లోపల బరువులు కలిగి ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్. ఎంపీ ఓ,స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పిడీలు, పీఈటీలు, వివిధ గ్రామాల సెక్రటరీలు పాల్గొన్నారు