కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని గురువారం ఆటో డ్రైవర్ల కు అందరికీ మద్నూర్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సై విజయ్ కొండ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ ఆటో నడిపే ప్రతి ఒక్కరు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాద బీమా కలిగి ఉండాలన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై ఆటోలు అఫి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దాన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దాన్నారు. అదేవిధంగా మద్నూర్ బస్టాండ్ లో నిలిపే ఆటోలు ఇబ్బడి ముబ్బడిగా నిల్పకుండా ..రోడ్డుపై నిలబకుండా వరుస క్రమంలో క్యూ లైన్ లో నిలబెట్టుకోవాలని డ్రైవర్లకు సూచించడం జరిగింది. మద్యం తాగి ఆటోలు నడిపితే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించడం జరిగింది. పలు విషయాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ్ కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.