జిన్నారం : మండల కేంద్రం జిన్నారంలోని గిరిజన గురుకుల బాలుర విద్యాలయం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ బిక్షపతి, ఎంఈఓ కుమారస్వామి మండల స్పెషల్ ఆఫీసర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నం, పప్పు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. వంట గదిలోని ఆహార పదార్థాల స్టాకును పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి అందించాలని రెండు పాఠశాలల సిబ్బందికి సూచించారు.