దౌల్తాబాద్: భారతదేశంలో మనుషులందరూ సమానమేనని కులమత, జాతివర్గ భేదాలు లేని సమ సమాజ నిర్మాణమే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్ష్యమని ఆయన ఆశయాలు ఆచరించినప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు.డా.బీఆర్. అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశ ప్రజల కోసం తన ప్రాణాలను కుటుంబాన్ని సైతం త్యాగం చేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది.ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా దిశానిర్దేశం చేస్తూ భారత పరిపాలన కొనసాగుతుంది. మానవులకు హక్కులు చట్టాలను కల్పించి సమ సమాజ నిర్మాణం కోసం మానవులందరూ సమానమని, నిచ్చెన మెట్ల వ్యవస్థను తొలగించడానికి అహర్నిశలు కృషి చేశారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు……