మోతె మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం వసతులను పరిశీలించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పిల్లలకు మంచి పోషిక ఆహారం అందిస్తూ మంచి విద్యను అందిస్తూ పిల్లల భవిష్యత్తుకు కృషి చేయాలనీ స్కూల్ ఇంచార్జీ కి, మరియు ఉపాధ్యాయూలను కోరారు. ఈ స్కూల్ కి ఎలాంటి అవసరలు ఉన్న మాకు తెలియజేయండి స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లి ఎలాంటి సమస్యను ఐన పరిష్కరించడానికి మా వంతుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.