మునగాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు, సిపిఐ నాయకులు చిల్లంచర్ల హరికిషన్ నెలమాషికం కార్యక్రమం సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ శివారులో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ మాట్లాడుతూ, వృద్ధాశ్రమంలో ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ఉన్నటువంటి వృద్ధులకు తమ సోదరుడు హరికిషన్ జ్ఞాపకార్థం వస్త్ర దానం చేయడం జరిగిందని తెలిపారు, అదేవిధంగా భవిష్యత్తులో హరికిషన్ పేరుతో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో హరికిషన్ సతీమణి చిల్లంచర్ల మనీ, కుమారుడు సాయిరఘు, కుటుంబ సభ్యులు చిల్లంచర్ల ఠాగూర్ బాబు, చిల్లంచర్ల ప్రభాకర్, చిల్లంచర్ల గిరి, మరియు హరి సోదరిమణులు మరియు అనాధాశ్రమం నిర్వాహకురాలు విజయమ్మ పాల్గొన్నారు.