ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శనివారం మండల కేంద్రంలోని స్థానిక బిసి బాలుర వసతి గృహాన్ని వారు సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు, ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వారుమాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల భోజనానికి ఉచితంగా అందించే బియ్యం నాణ్యతగా లేకపోవడం వల్లనే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు విషతుల్య ఆహారంతో అనారోగ్యానికి గురవుతున్నారని గత ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తే నేటి ప్రభుత్వం మాత్రం పురుగులు పట్టిన రాళ్లు మెరిగెలు ఉన్నటువంటి నకిలీ రేషన్ బియ్యాన్ని అందించడం వల్లనే ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ప్రమాదాల బారిన పడి అనారోగ్యంతో హాస్పిటల్ లో పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ వసతి గృహ మరియు గురుకుల పాఠశాలవిద్యార్థులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో పలువురు బిసి యువజన సంఘం నాయకులు రంగా, మహేష్, నరేష్ పాల్గొన్నారు.
previous post