చేయూత పించన్లు పెంచాలని గత 6నెలల నుండి ఉద్యమాలు చేస్తూన్న సందర్బంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సోమవారం ఉదయం వికలాంగులను నల్లబెల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD INDIA వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు మాట్లాడుతూ పించన్లు పెంచుతామని హామి ఇచ్చి ఏడాది గడుస్తున్న నేటికి ఎటువంటి ప్రకటన చేయడంలేదు ప్రకటన చేయాలని మర్యాదపూర్వకంగా
ఇంద్ర పార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుతేరే క్రమములోనే పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పించన్ల మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. కొత్త ప్రభుత్వం వికలాంగుల దినోత్సవములో వరాల జల్లు కురుపిస్తారేమొ అంటే ఎటువంటి సంక్షేమ నూతన పథకములు ప్రకటించకపోవడం యావత్ తెలంగాణ వికలాంగులు నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురుపిస్తాము మా కార్యక్రమాలను అడ్డుకోవద్దు అని పదే పదే కాంగ్రెస్ పెద్దలు ప్రగల్బాలు పలికి ఈ రోజు ప్రభుత్వం తరుపున ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో నిరుత్సాహానికి గురి కాకుండా ఉద్యమాన్ని మరింత ఉద్రుతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమములో
మండల్ ఉపాధ్యక్షులు ఈదునూరి విజయ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు చింత కుమార్ స్వామి,జిల్లా నాయకులు మంద రవి తదితరులు పాల్గొన్నారు.