ఆర్పీల కనీస వేతనాలు,ప్రభుత్వ గుర్తింపు కార్డు,డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు 40 మంది మహిళలను ముందస్తుగా అరెస్టు చేసి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఆర్ పి లు మాట్లాడుతూ గత ప్రభుత్వమైన ప్రస్తుత ప్రభుత్వమైన ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఏవైనా సర్వేలైనా అన్ని నిర్వహించేది ఆర్పీ లేనని అయినప్పటికీ ప్రభుత్వం వారు ఆర్పీలను చిన్నచూపు చూస్తున్నారని ఇప్పటికైనా సీఎం రేవంత్ అన్న మా బాధలు విని మా సమస్యను పరిష్కరించి కనీస వేతనాలు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.