Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలోని దత్తాశ్రమంలో ఆదివారం ఘనంగా శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు, 34వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ మహారాజ్‌ ఆధ్వర్యంలో ద్వజారోహణం కార్యక్రమం, పుండరీకం మహరాజ్, అంజయ్య మహారాజ్, ఛాయ పఠ పాదుకపూజతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. కృష్ణాగౌడ్, సాయాగౌడ్, రాజా గౌడ్, వెంకటేశం గౌడ్, హరికృష్ణగౌడ్‌ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దత్త జయంతిని భక్తుల మద్య ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కన్‌సాన్‌పల్లి, జోగిపేట, కేరూర్‌ బిజిలిపూర్, ఖాదిరాబాద్, మాసానిపల్లి, గడిపెద్దాపూర్, నాగుల పల్లి, మర్వెళ్లి గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆయా గ్రామాలకు చెందిన భక్త మండలుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు నిర్వాహకులు కట్టరామా గౌడ్, భక్తులు సత్యనారాయణ గౌడ్, రమేశ్‌ ముదిరాజ్, లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Related posts

సిల్వర్ డేల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ● ఆ స్కూల్ బస్సుల వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, ఎంఈఓ లకు ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

TNR NEWS

బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించిన అటవీ శాఖ అధికారులు…  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పక్షి ప్రేమిక పర్యా టకులు…

TNR NEWS

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటం…

TNR NEWS

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS