కోదాడ మండల పరిధిలోని స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో బుధవారం కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి రాంరెడ్డి, వరలక్ష్మి ల మనవడు సుక్రుత్ ఆతార్ మొదటి పుట్టినరోజు వేడుకలను అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధ,మానసిక వికలాంగుల పిల్లల మధ్య తమ మనవడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఈ సందర్భంగా ఎంతోమంది నిర్భాగ్యులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న శనగల జగన్మోహన్ ను సంస్థ సిబ్బందిని ఈ సందర్భంగా వారు అభినందించారు.అనాధ పిల్లలకు తన వంతు సహాయ సహకారాలుఎల్లవేళలా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కృష్ణ కాంత్, నిహారిక కుటుంబ సభ్యులు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు………….