Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఇథనాల్   అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం …  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు….

 

మోతే: ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చాయి. బుధవారం మోతే మండలం సర్వారం గ్రామంలో ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ గ్రామ జనరల్ బాడీ సమావేశం జరిగింది. సందర్భంగా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులుమాట్లాడుతూ మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ పనులు పూర్తి అయితే చుట్టుపక్కన గ్రామాలైన ఆత్మకూర్ (ఎస్) మండలంశెట్టి గూడెం, కోట పహాడ్, మోతే మండలం సర్వారం, కూడలి, అప్పన్నగూడెం, బురకచర్ల, గోల్ తండా, మేకల పాటి తండా, సిరికొండ గ్రామాలతో పాటు అనేక గిరిజన తండాలు, వీటితో పాటు చుట్టుపక్కన ఉన్న అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం పైఇథనాల్ కంపెనీ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.ఈ ఇథనాల్ కంపెనీ కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల తో పాటు గుండె, మెదడు, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నెలకొని ఉందన్నారు. దీని మూలంగా భవిష్యత్తులో చుట్టూ 20 కిలోమీటర్ల మేర మనుషులు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం మూలంగా రైతుల పంటలు పూర్తిగా నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బంగారo పండే పంట భూములు బీడు భూములుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదల అయ్యే వ్యర్ధాలను పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి వదిలితే చుట్టుపక్కన ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి నీరు కలుషితంగా మారి ప్రజలు, రైతులు, పశువులు, చేపలు, మూగజీవులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే అధికార ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా 24మంది తో ఎన్ఎంకె ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా నాయకులు మండారి డేవిడ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీజిల్లా నాయకులుమట్టిపల్లి సైదులు, నారబోయిన వెంకట్ యాదవ్, ఆవుల నాగరాజు యాదవ్, నల్లెడ మాధవరెడ్డి, గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, కాకి సురేందర్ రెడ్డి, కాంపాటి దిలీప్, కాకి నారాయణ రెడ్డి, జంపాల స్వరాజ్యం, అలుగుబెల్లి వెంకటరెడ్డి, పో డపంగి ముత్తయ్య, సర్వారం గ్రామ నాయకులు వెంకటేశ్వరరావు, మేకల గురుకిష్ణ, ఉప్పుల మధు యాదవ్, మేకల శ్రీనివాస్ యాదవ్, పల్స మల్సూర్, వీరబోయిన లింగ యాదవ్, మేకల రామన్న, బాలాజీ నాయక్, నల్లాల శ్రీను ఉప్పుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs

నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

TNR NEWS

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి  ఎస్సై విజయ్ కొండ

TNR NEWS

నూతన దంపతులకు మంత్రి తుమ్మల ఆశీర్వాదం

TNR NEWS

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS