కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలంలోని మాగి గాయత్రి చక్కెర కర్మగారంలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ ఘనవిజయం సాధించింది. ఫ్యాక్టరీలో పనిచేసే 185 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో బీఎంఎస్, ఐఎన్టీయూసీ, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్లు నిలిచాయి. బీఎంఎస్కు 93 ఓట్లు రాగా ఐఎన్టీయూసీకి 47 ఓట్లు, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కు 45 ఓట్లు వచ్చాయి. బీఎంఎస్ ఘనవిజయం సాధించడంతో యూనియన్ నాయకులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.