Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

డ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన

సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి మోతే మండల పరిధి లోనీ సిరికొండ గ్రామంలో ముదిరాజ్ కాలనీ లో సైబర్ నేరాల పైన, గంజాయి, డ్రగ్స్ మత్తు మందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన ఎస్సై యాదవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో మూఢనమ్మకాలపై,రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930‌ టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని

వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తు మందులకు‌ సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు. అనంతరం పోలీసు కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక,పాటలతో ప్రజలకు అవగాహగన

కల్పించారు. ఈ కార్యక్రమం నందు పోలీస్ సిబ్బంది, కళాబృందం సభ్యులు గోపయ్య, గురులింగం,క్రిష్ణ, నాగార్జున,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

TNR NEWS

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు

TNR NEWS

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

TNR NEWS

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS