February 3, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోదాడ ప్రజలకు విజ్ఞప్తి / న్యూసెన్స్ చేసేవారికి పోలీస్ వారి హెచ్చరిక నూతన సంవత్సర వేడుకల పేరుతో తోటి పౌరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు  కోదాడ డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి

పోలీసు శాఖ తరుపున పౌరులందరికి, ముందస్తు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలను కోదాడ డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని క్రింది సూచనలను పాటించవల్సిందిగా విజ్ఞప్తి. నూతన సంవత్సర వేడుకలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం కూడా విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా (ఒకసారి పాత వార్తలను చూడండి) అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైకులు, కార్లను ఇస్తే..వారు ఆ వాహనాలను వేగంగా, నిర్లక్ష్యంగా లేక మద్యం, మత్తులో నడపడం వలన ప్రమాదాలు జరిగి జరిగే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, సాధ్యమైనంత వరకు పిల్లలను కట్టడి చేసుకొవాలి. న్యూ ఇయర్ సందర్భంగా “డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసేందుకు, అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు, త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు న్యూసెన్స్ చేసే వారిపై చర్యలు తీసుకోబడును.31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ పౌరులను అసౌకర్యం కలిగే విధంగా తిరిగే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ

వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట లోపు పూర్తిచేసుకుని తమ తమ ఇళ్లకు వెళ్లాలని కోరుచున్నాము.

అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది

కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, ప్రజల రక్షణ కొరకు, పోలీసుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదన్నారు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఈవెంట్స్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అంతే కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాల పేరుతో, టికెట్లు/ఎంట్రీ ఫీజుల రూపంలో ప్రజల నుంచి డబ్బ్బలు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.*డి జె సౌండ్ సిస్టమ్స్ పెట్టి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ, వృద్దలకు, పేషంట్లకు, గర్భవతులకు, పిల్లలకు ప్రాణహాని కలిగే విధంగా చేసే వారిపై కఠిన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, వాహనాలను/ఎక్విప్మెంట్ ను సీజ్ చేసి జైలుకు పంపే విధంగా చర్యలు తీసుకొనబడును*.కావున పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి.

Related posts

ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS

లక్ష డప్పులతో సత్తా చాటుతాం

Harish Hs

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs

సర్వారం సింగిల్ విండో పాలకవర్గం రద్దు…?

Harish Hs

విద్య ద్వారా పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి….. అదనపు కలెక్టర్ డి.వేణు మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్

TNR NEWS