సుధా బ్యాంకు 2025 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ను బుధవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుధా బ్యాంకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి, ఖాతాదారులకు, బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ ప్రజలందరి మన్ననలు పొందిందని తెలిపారు. బ్యాంకు తక్కువ వడ్డీకి అందించే అనేక విద్యా, వ్యాపార, గృహ బంగారం, వాహన రుణాలు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఉపాధి మార్గాలను పొంది ఆర్థికంగా స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ సుధా బ్రాంచ్ మేనేజర్ శ్రీ. చెన్నూరు. రవి కుమార్,బ్యాంకు నిర్వహణ బోర్డు చైర్మన్ స్వామి. వెంకటేశ్వర్లు, సభ్యులు ఇరుకుళ్ళ. చంద్ర శేఖర్ గారు, వెంపటి. వెంకట రమణ , బ్యాంకు ఖాతా దారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు…………