Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సరం రోజున ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తీసుకువచ్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద విద్యార్థులకు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను టీటీడీ నుంచి తెప్పించిన ప్రత్యేక శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబు,పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, పైడిమర్రి వెంకటనారాయణ,లారీ అసోసియేషన్ సెక్రటరీ ఎలగందుల నరసయ్య, బాబా, తరుణ్ తదితరులు పాల్గొన్నారు…….

Related posts

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం.

TNR NEWS

అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి

TNR NEWS

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

TNR NEWS

దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 115 దరఖాస్తుల రాక

TNR NEWS

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

Harish Hs

జ్యుయలరీ షాప్ ను ప్రారంభించిన:ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు అంజన్ గౌడ్  

TNR NEWS