Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.

కోదాడలో కబడ్డీ క్రీడకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఖాజా భాయ్ ఆశయాలను నేటి యువత సాధించాలని రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ మహబూబ్ జాని, బషీర్ లు అన్నారు. ఖాజా భాయ్ 35వ వర్ధంతి సందర్భంగా గురువారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో క్రీడాకారులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 -90 కాలంలో కోదాడలో కబడ్డీ క్రీడాకారూడిగా అనేక విజయాలు సాధించి ఆ రోజుల్లో ఎంతో మందిని జాతీయ క్రీడాకారులుగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు.ఖాజా భాయ్ తోనే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కబడ్డీ క్రీడలో కోదాడకు ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. క్రీడాకారులు ఖాజా భాయ్ ఆశయాలు సాధించాలన్నారు. కబడ్డీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తానన్నారు. కోదాడలో స్టేడియం నిర్మిస్తే ఖాజా బాయ్ పేరు పెట్టాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బాగ్దాద్,భాజాన్, కాంపాటి శ్రీను, పంది తిరపయ్య,ఏపూరి రాజు,గంధం పాండు, కత్తి వెంకటరత్నం, శమీ,మునీర్, నిజాం, రహీం, సైదులు పలువురు క్రీడకారులు కాజా భాయ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు

TNR NEWS

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

Harish Hs

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

TNR NEWS

వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

Harish Hs

కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

TNR NEWS

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs