జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలో కొనసాగుతున్న మేజర్ పంచాయితీ బతికేపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బతికేపల్లి మండల సాధనసమితి ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
వివిధ గ్రామాలనుండి పెద్ద సంఖ్యలో ప్రజలు జగిత్యాల కలెక్టరెట్ కు చేరుకొని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.పెగడపల్లి మండలంలోని బతికే పెల్లి గ్రామపంచాయతీలో సుమారు 8వేల జనాభా కలిగి ఉండి రెండు ఎంపిటిసిలతో విస్తరించి ఉన్నది . దీనికి అనుబంధ గ్రామంగా పుల్లయ్యపల్లి, కొండయ్యపల్లి ఆవాస గ్రామాలు కలవు. పాలన సౌలభ్యం కొరకు రెవెన్యూ మండలం ఏర్పాటు చేయుటకు అనువైన ప్రదేశం మరియు మౌలిక వసతులు కలవు. బతికే పెల్లి గ్రామమును మండలం గా ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి టిడిపి ప్రభుత్వం 1983లో ప్రైమరీ నోటిఫికేషన్ లో పేర్కొంటూ ప్రైమరీ గెజిట్ జారీ చేసి అర్ధాంతరంగా రెవెన్యూ మండలం ఏర్పాటును ఆపివేసింది. 1983 నుండి బతికేపల్లి గ్రామ ప్రజలు రెవెన్యూ మండలం ఏర్పాటు చేయాలంటూ పలు సందర్భాల్లో సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. బతికే పెల్లి గ్రామంలో 1967 లోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983లో ప్రభుత్వ హోమియో వైద్యశాల 1965 లో హెల్త్ సబ్ సెంటర్ కలదు. బతికే పెల్లి పంచాయతీని రెవెన్యూ మండలం ఏర్పాటు చేస్తే దీని పరిసర గ్రామాలైన మద్దులపల్లి, ఆరవెల్లి, దోమలకుంట,సుద్దపెల్లి, లింగాపూర్, శాలపల్లె గ్రామాలకు పాలన సౌలభ్యం ఏర్పాటు అయితది. బతికేపల్లి గ్రామంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఉండగా మద్దులపల్లి-1.ఆరవెల్లి-దోమలకుంట కలిపి-1 సుద్దపల్లి-1 లింగాపూర్-శాలపల్లి గ్రామాలు కలిపి-1 ప్రస్తుతం ఆరు మండల ప్రాదేశిక నియోజకవర్గాలు ఉండగా నూతన రెవెన్యూ మండలం తో పాటు దోమలకుంట గ్రామానికి ఎంపీటీసీ నియోజకవర్గం కేటాయిస్తే 7 ఎంపీటీసీలు,8 గ్రామపంచాయతీలు ఏర్పాటు అవుతాయని పరిపాలన సౌలభ్యం కొరకు బతికే పల్లి గ్రామన్ని మండలం గా ఏర్పాటు చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభధ్రుల శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి లను కలిసిన మండల
సాధన సమితి సభ్యులు బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలనీ కోరుతూ వినతిపత్రం సమర్పించారు.స్పందించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో పాటు ప్రభుత్వానికి లేఖలు రాస్తామని పేర్కొన్నారని మండల సాధన సమితి నాయకులు తెలిపారు