ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో శ్రీనివాస్ ద్వారా ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. కోర్టు కేసు ఫైళ్లను, ధరణి దరఖాస్తులను, రికార్డుల నిర్వహణ, ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.