గజ్వేల్ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు పరిశీలన పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కుకునూరుపల్లి మండల విద్యాశాఖ అధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని మేదిని పూర్, రాముని పల్లి, ముద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. కనీస సామర్థ్యాల పెంపొందించడంతోపాటు అన్ని అంశాల్లో విజ్ఞానం పెంపొదేలా చూడాలన్నారు. సంస్కారవంతమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. ఎఫ్ఎ, ఎఫ్ఎల్ఎన్ పరీక్ష ఫలితాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.