Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి.  కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించిన  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు

మోతే: ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్ర నష్టం కలిగించేఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరుతూఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మోతే మండలానికి వచ్చిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరారు. కంపెనీపనులు పూర్తి అయితే చుట్టుపక్కన గ్రామాలైన ఆత్మకూర్ (ఎస్) మండలంశెట్టి గూడెం, కోట పహాడ్, మోతే మండలం సర్వారం, కూడలి, అప్పన్నగూడెం, బురకచర్ల, గోల్ తండా, మేకల పాటి తండా, సిరికొండ గ్రామాలతో పాటు అనేక గిరిజన తండాలు, వీటితో పాటు చుట్టుపక్కన ఉన్న అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం పైఇథనాల్ కంపెనీ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.ఈ ఇథనాల్ కంపెనీ కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల తో పాటు గుండె, మెదడు, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నెలకొని ఉందన్నారు. దీని మూలంగా భవిష్యత్తులో చుట్టూ 20 కిలోమీటర్ల మేర మనుషులు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం మూలంగా రైతుల పంటలు పూర్తిగా నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బంగారo పండే పంట భూములు బీడు భూములుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదల అయ్యే వ్యర్ధాలను పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి వదిలితే చుట్టుపక్కన ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి నీరు కలుషితంగా మారి ప్రజలు, రైతులు, పశువులు, చేపలు, మూగజీవులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే స్థానిక ఎమ్మెల్యే అయిన ఉత్తం పద్మావతి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జోక్యం చేసుకొని అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా నాయకులు మండారి డేవిడ్ కుమార్, మట్టిపల్లి సైదులు, నల్లెడ మాధవరెడ్డి, గంట నాగయ్య, కొనుకుంట్ల సైదులు, అలుగు బెల్లి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

*తెలంగాణ ఉద్యమకారులకు ప్రశంస పత్రాల పంపిణీ*

TNR NEWS

శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు,ఇళ్లను ఖాళీ చేయించాలి

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

Harish Hs

వర్గల్ మండల కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి

TNR NEWS

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

TNR NEWS