చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా చేయాలని చేర్యాల పట్టణ, చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి,దూల్మిట్ట మండలాల చెందిన ప్రజలు,నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నాడు చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్లతో ర్యాలీగా వెళ్ళి సిద్దిపేట కలెక్టరేట్ కు ర్యాలీగా తరలి వెళ్లినారు.ఈ సందర్భంగా జెఏసీ చైర్మన్ వకుళా భరణం నర్సయ్య పంతులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సిఎం రెవెంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వెంటనే చేర్యాల ను రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో బారి ఎత్తున ఉద్యమాన్ని చేసి డివిజన్ ను సాదించుకునెంత వరకు ఈ పోరాటాన్ని ఇంకా ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్,బీజేపీ,సీపీఎం,టిడిపి,ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.