February 3, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూచించారు.నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీస్,రవాణా శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ ర్యాలీని గవర్నమెంట్ మెడికల్ కళాశాల కూడలి ఎన్టీఆర్ పార్క్ దగ్గర బైక్ ర్యాలీను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా, వారి ‌ కుటుంబాలకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్నచిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చవద్దని హితవు పలికారు.రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతోమంది క్షతగాత్రులు గా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90 శాతం వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, నిబధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ, ఎవరికివారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచ్రక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ, సూర్యాపేట టూవిలర్స్ అసోసియేషన్ వారు అందజేసిన హెల్మెట్ లు కలేక్టర్ అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించారు. అనంతరం ర్యాలీ ప్రాధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఆర్ టిఓ సురెష్ రేడ్డి, ఎం.వి.ఐ లు యస్ .జయప్రకాష్ రెడ్డి , ఎ.ఆధిత్య ,ఎయమ్విఐలు , సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ బాయ్స్ హాస్టల్స్ సందర్శన నూతన మెను అమలు చేయాలి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవి, తిరుపతి డిమాండ్

TNR NEWS

సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TNR NEWS

*రైతు పండుగ ప్రజా పాలన విజయోత్సవాలు* *పిఎసిఎస్ చైర్మన్ గూడూరు చల్లా లింగారెడ్డి ఆధ్వర్యంలో* 

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి  – సొంత నిధులతో మండల కేంద్రంలో నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ 

TNR NEWS

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS