బెజ్జంకి మండలంలోని గుండారం కల్లేపల్లి ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు వరంగల్ జిల్లాలోని పరకాల పట్టణంలోని నేషనల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించినట్లు కరాటే శిక్షణ ఉపాధ్యాయులు దేవులపల్లి రజిత వైష్ణవి, శ్రీనివాస్ తెలిపారు. గుండారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఎం అక్షిత, గోల్డ్ మెడల్ బి లావణ్య, సిల్వర్ మెడల్ పీ స్ఫూర్తి బ్రౌన్జ్ మెడల్ సాధించినట్లు, కల్లెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం అశ్విత గోల్డ్ మెడల్ బి ఆరాధ్య బ్రౌంజ్ మెడల్ పొందారని కరాటే శిక్షకురాలు దేవులపల్లి రజిత వైష్ణవి తెలిపారు. గుండారం, కల్లేపల్లి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నూగూరి నాగవేణి, భారతి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం, పలువురు గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.