కోదాడ పట్టణ పరిధిలోని కోమర బండలో ఈనెల7 నుంచి నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వ ఉచిత వేసవి శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. విద్యార్థులు ఈ శిబిరంలో ఇంగ్లీష్, గ్రామర్, డాన్స్, మ్యూజిక్, ఇండోర్ గేమ్స్ వంటి ఆయా అంశాలపై అవగాహన పెంచుకున్నారు. నేడు ముగింపు సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందు శిక్షణ పొందిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అదేవిధంగా అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి పి.టి కొండల్ తదితరులు పాల్గొన్నారు……..