పెంచికల్ పేట్ మండలకేంద్రంలోని కొండపల్లి గ్రామంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా పెంచికల్పేట్ ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులకు రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
అనంతరం పెంచికల్పేట్ ఎస్సై కొమరయ్య మాట్లాడుతూ.వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉందని, అతి వేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో నడిపే వారితోపాటు ఎదుటి వారు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని తల్లితండ్రులకు తెలపాలని,. ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లతగు జాగ్రత వహించాలని,హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలన్నీ ఉంచుకోవాలని సూచించాలని తెలిపారు.