మోతె, అక్టోబర్ 22(ఆంధ్రప్రభ) : ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ జయంతి సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ (స్వేరోస్ డే) సందర్భంగా మోతె మండల కేంద్రంలో స్వేరోస్ నెట్వర్క్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ, స్వేరోస్ మోతె మండల అధ్యక్షులు దున్నపోతుల దుర్గారావు ల ఆధ్వర్యంలో ఎస్.ఆర్. శంకరన్ ఐఏఎస్ జయంతి ఆయనకు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఆయనను ‘పేదల ఐఏఎస్’గా అభివర్ణించిన పలువురు ఆయన నిబద్ధత, పేదల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు సూచించారు.శంకరన్ బడుగు బలహీన వర్గాలకు చేసిన కార్యక్రమాలను చూసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శంకరం జన్మదిన పురస్కరించుకొని అక్షరం,ఆర్థికం,ఆయుధం అనే నినాదంతో స్వేరోస్ నెట్ వర్క్ ను స్థాపించి ఎంతో మందిని ఉన్నత పౌరులుగా స్వేరోస్ నెట్ వర్క్ ద్వారా తీర్చిదిద్దారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బివిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, బివిహెచ్పిఎస్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు జంజిరాల సుధాకర్, బివిహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి ఈదయ్య, లచ్చు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
