రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు మృతి చెందారు.
ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,… ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు..
ఘటన స్థలంలోనే నలుగు రు మృతి చెందగా, ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరో 17 మందికి గాయాల య్యాయి. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.