Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

గుడుంబా ఇస్తావారాలపై పోలీసుల దాడులు… 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం:  ఈస్గాం ఎస్ఐ ‌మహేందర్ఆధ్వర్యంలో..

 కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజురుల్ నగర్ విలేజ్ నెంబర్ 5 గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఉదయం గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో తుంగమడుగు గ్రామానికి చెందిన మహేష్(30) తండ్రి సుధాకర్, కులం: యాదవ, వృత్తి కూలీ, అను వ్యక్తి విలేజ్ నెంబర్ 5 గ్రామానికి శివారులో గుడుంబా తయారు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ దాడిలో 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. అలాగే 5 లీటర్ల గుడుంబాను స్వాధీన పరుచుకుని అతనిపై తెలంగాణ ప్రొహిబీషన్ ఆక్ట్ సి.ఆర్ నెంబర్ 07/24యు /ఎస్ 7(ఎ )ర్ /డబ్లు 8(ఈ ) ప్రకారం కేసు చేసినట్లు ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గుడుంబా తయారుచేసిన విక్రయించిన అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్సై మహేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS

సాంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి

Harish Hs

యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మజాహర్

TNR NEWS

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కీసర సంతోష్ రెడ్డి

Harish Hs

సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలి….. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

Harish Hs

భగవద్గీత పఠనంలో స్వర్ణ పతకం జయించిన లక్ష్మి తులసి

Harish Hs