Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నె తేవాలి  పార్టీలో పని చేసే కార్యకర్తలను గుర్తిస్తాం   మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి తోనే కోదాడ అభివృద్ధి కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడలోని ఎర్నేని బాబు నివాసంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా చైర్మన్గా ఎన్నికైన వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బషీర్ లకు ఏర్పాటుచేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరము కలిసి కోదాడ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలు చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ షేక్ బషీర్ లు మాట్లాడుతూ తమకు ఇంత ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు కు కృతజ్ఞతలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామన్నారు తమకు పదవి కేటాయించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి, సహకరించిన సీనియర్ నాయకులకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్. కే జబ్బర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, కాంగ్రెస్ నాయకులు ఒంటి పులి వెంకటేష్, చింతలపాటి శ్రీనివాస్, రావెళ్ళ కృష్ణారావు, నలజాల శ్రీనివాస్, చందు నాగేశ్వరరావు, మందలపు శేషు, నెమ్మాది దేవమని ప్రకాష్ బాబు, కౌన్సిలర్లు గంధం యాదగిరి, వంటి పులి రమా శ్రీనివాస్, కోళ్ల ప్రసన్నలక్ష్మి కోటిరెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, కర్రీ శివ సుబ్బారావు, ఖదీర్, కాజా, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్, యూత్ అధ్యక్షులు పోటు కోటేశ్వరరావు, లైటింగ్ ప్రసాద్, చింత బాబు మాదిగ, కాజా గౌడ్, గంధం పాండు, బొలిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొని సన్మానించారు.

Related posts

బి.యన్.రెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండో దశ  ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరి కుప్పల వెంకన్న  జిల్లా కార్యదర్శి షేక్ నజీర్

TNR NEWS

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

TNR NEWS

బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారికి ఘన సన్మానం ముఖ్యఅతిథిగా తాజా మాజీ జడ్పిటిసి పాశం రాంరెడ్డి

TNR NEWS

మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలి

TNR NEWS

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

TNR NEWS

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS