Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

రాయికల్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసం ఇందిరా భవన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల అర్బన్, రూరల్ మండలం, సారంగపూర్, బీర్పూర్, రాయికల్ మండలాలకు చెందిన సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన రూ.1 కోటి 85 లక్షల 20 వేల రూపాయల విలువగల చెక్కులు లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ…రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుందని, 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన నడిచిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు మిన్నగా మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. గతంలో అమలు చేసిన కార్యక్రమాలు అన్ని కొనసాగిస్తూ వాటికి అదనంగా ఈసంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రాథమిక హక్కులలో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు. వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వపరంగా అవకాశాలు ఏ మేరకు ఉన్న వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వపరంగా పొందలేని సమయంలో ప్రైవేట్ హాస్పిటల్ లో ఆశ్రయించడం సహజం ప్రభుత్వపరంగా ఆరోగ్యశ్రీలో జరిగే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని, సీఎం సహాయనిది ద్వారా కొంత మాత్రమే మనకు లబ్ది చేకూరుస్తుంది కానీ ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా వైద్య సదుపాయం పొందవచ్చు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు అండగా నిలుస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సంక్షేమమే ద్యేయంగా ఉచిత బస్ రవాణా సౌకర్యం, నిరుపేదలు అయిన దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అల్పసంఖ్య వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్య సదుపాయం అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. 80 శాతం ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతున్నారు అని అన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ 85 శాతం జరిగిందని, ఇంకో 25 శాతం మిగిలి ఉందని అన్నారు. రూ.2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి ఉంది కాని, నిధుల కొరతతో మాత్రమే జాప్యం అవుతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి అసలు రుణమాఫీ ఆలోచననే లేదని అన్నారు. పెట్టుబడి దారులకు మాత్రమే బీజేపీ లక్షల కోట్ల అప్పుల రుణాన్ని బ్యాంకుల ద్వారా మాఫీ చేస్తుంది కానీ రైతులకు రుణమాఫీ చేసే ఆలోచన లేదని అన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడకుండా అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ గారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తే రూ.2లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయవచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణమాఫీ చేయడానికి బాధ్యతగా సహాయం అందించాలని అన్నారు. గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ రూ.5 లక్షలు ఉన్న పరిమితి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. రూ.10 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు అని అన్నారు. రేషన్ కార్డుల జాబితాలో పేరు రానివారు ఆందోళన చెందవద్దని రేషన్ కార్డ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. 21వ తేదీ నుండి గ్రామసభ, వార్డు సభలలో పేరు రాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ గృహ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని, నియోజకవర్గానికి 3500 ఇండ్లు పంపిణీకి ప్రభుత్వ స్వీకారం చుట్టిందని పూర్తిగా ఇల్లు లేని వారు వికలాంగులు ఒంటరి మహిళలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ అని ఎంతమందికి ఇచ్చిందో తెలియదు కానీ, గ్రామాలలో వెళ్తే ఇందిరమ్మ గృహ సదుపాయాలు మాత్రమే కనిపిస్తాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన ఫలితం పొందలేకపోయినా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గల్ఫ్ లో అకాల మరణం పొందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల సహాయం అందే విధంగా కార్యక్రమాన్ని అమలు జరిగే విధంగా చేయగలిగాను అని అన్నారు.

Related posts

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిల్లుట్ల శ్రీనివాస్ నియామకం…. గతంలో కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన పిల్లుట్ల శ్రీనివాస్…..

TNR NEWS

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs