Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జాట్కో అభ్యర్థి పూల రవీందర్ ను గెలిపించండి

ఫిబ్రవరి 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో జాట్కో అభ్యర్థి పూల రవీందర్ ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జాట్కో సెక్రటరీ జనరల్ కే కృష్ణుడు,ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ డివిజన్ లో ప్రచారం అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావాలంటే పూల రవీందర్ ని గెలిపించాలన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు, డిఏలు, పిఆర్సి, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, మోడల్ స్కూల్ లో పనిచేసే టీచర్లకు జీతాల చెల్లింపు, కేజీబీవీ టీచర్లకు టైం స్కేలు, రెగ్యులరైజేషన్, ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ, పాఠశాలలు బలోపేతం కావాలంటే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బంధం వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగంటి పెద్ద నాగేశ్వరరావు లు పాల్గొన్నారు…….

Related posts

మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం… గురుస్వామి వెల్ది శ్రీకాంత్ చారి

TNR NEWS

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS

TNR NEWS

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

పురపాలక సంఘం కార్యాలయంలో సమావేశం. పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గా అదనప కలెక్టర్ సుధీర్.

TNR NEWS