వరంగల్ జిల్లా నర్సంపేటలో రోజురోజుకు రాజకీయం వేడెక్కిపోతుంది. టిఆర్ఎస్ పార్టీ వాళ్లు నర్సంపేట లో పది సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి , మరియు మేనిఫెస్టోలో లేని పనులు చేశామని అన్నారు. మా హాయంలో జరిగిన పనులు తప్ప ఇంకేం లేదని ప్రస్తుత ఎమ్మెల్యే పనులు చేయడం లేదని అభివృద్ధిలో విజన్ లేదని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తుంటే ప్రతిదాడిగా కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిచి నర్సంపేట నియోజకవర్గం కు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా తేలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ను విమర్శించే హక్కు మాజీ ఎమ్మెల్యే కి లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. రెండు పార్టీల నడుము బిజెపి నాయకులు చేరి, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి తప్ప కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెడుతూ తాము కూడా ఈ రెండు పార్టీ లకు ఏం తక్కువ కాదన్నట్టు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పై విమర్శన చేస్తున్నరు.