వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో నందిగామ గ్రామనికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రి నాగరాజు యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కంచె రవి,రఘువీర్,పోరిక వినయ్,అడ్డా అశోక్, గణేష్,గుగులోతు పవన్, మూడు సురేష్ బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాత్రి భారతీయ జనతా పార్టీ లో చేరారు.కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో పేద,మధ్యతరగతి ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నర్సంపేట నియోజకవర్గంలో యువత పెద్దఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారన్నారు.దేశ ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్న బీజేపీలో నియోజకవర్గ యువత చేరాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో అమలు కానీ హామీలతో అధికారం చేపట్టి సంవత్సరం దాటుతున్న ఏఒక్క హామీని అమలు చేయకుండా పబ్బం గడుపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాల్లో నరేంద్ర మోదీ గారు ప్రవేశ పెడుతున్న పథకాలే ఎక్కువగా ప్రజలకు చేరువయ్యాని,మోడీ గారి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని,కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తల పై ఉందన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీ పార్టీ యువతకు పెద్దపీట వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందని కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు వల్లే పార్వతలు, ఈర్ల నాగరాజు,సుధాగాని ప్రమోద్,దికొండ సునీల్ పాల్గొన్నారు.