కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ లో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాటలను బోధించారు.విద్యార్థులు కలెక్టర్ గా,జిల్లా విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా అలరించారు. ఈ సందర్భంగా వసతిగృహ సంక్షేమ అధికారి, ప్రధానోపాధ్యాయురాలు కే నాగజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలి అన్నారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాలను నెరవేర్చాలన్నారు. వసతి గృహాల్లో ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉషారాణి, సుజాత, రేణుక, పద్మాబాయి, స్వరూప, రేణుక, ప్రియాంక, స్వాతి, నాగేశ్వరరావు, సరిత, లలిత విద్యార్థులు పాల్గొన్నారు………

previous post