సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పరిధిలో నిర్మల్ నగర్ గ్రామంలో ఘనంగా జరిగిన మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు సందర్భంగా నిర్మల్ నగర్ అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు మరియు గర్భిణీలకు పండ్లు బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ యువత ముందుండి కెసిఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్రె రాజు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె యాదగిరి, కర్రే రాములు మరియు బిఆర్ఎస్ యూత్ తదితరులు పాల్గొన్నారు