ఉద్యోగాల క్యాలెండర్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ బండారు శ్రీకాంత్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కరీంనగర్- మెదక్- నిజామాబాద్- అదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో కల్సి ప్రజారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో నిరుద్యోగ విద్యార్థి యువకులకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముందస్తు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగిందని, రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయించడం జరిగిందని తెలిపారు. కావున ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ప్రచార సభలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మఖాన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్షులు నాయిని యాదగిరి, గోపాలరావు అడ్వకేట్, గజ్వేల్ మండల అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి, గజ్వేల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.