నెక్కొండ నాటు సారా నిర్మూలనకై నిర్వహిస్తున్న దాడులలో భాగంగా కొందరు వ్యక్తులు బెల్లం మరియు పటికను రవాణా చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు చంద్రుగొండ గ్రామ శివారులలో ఈరోజు తెల్లవారుజామున వాహన తనిఖీలను చేపట్టగా చెన్నారావుపేట మండలం అడ్డబాట తండా కు చెందిన భూక్య కీమ్య s/o హేమ్ల అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి అక్రమంగా రైలులో బెల్లం మరియు పటికను తీసుకొని వచ్చి రాత్రిపూట రైలు చైన్ లాగి గేట్పల్లి తండా సమీపంలో రైలు నుండి బెల్లం మరియు పటిక బస్తాలను దింపుకొని తన ద్విచక్ర వాహనం పైన తన గ్రామానికి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో 70 కేజీల నల్ల బెల్లం మరియు 20 కేజీల పటిక మరియు అతడు ద్విచక్ర వాహనం మొబైల్ ఫోను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి కానిస్టేబుల్స్ నాగరాజు, రంజిత్, దిలీప్ పాల్గొన్నారు.