మెట్ పల్లి మండలం రామాలచ్చక్కపేట్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బుధవారం ఛత్రపతి శివాజీ కమీటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. భారత దేశ ఔన్నత్యాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప రాజు గా ఛత్రపతి శివాజిని కొనియాడారు. యువత దేశం, దర్మం కోసం పని చేసేందుకు ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో సభ్యులు రాజేందర్, సుమన్, శేఖర్, సురేష్, రాజపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.