బీసీ ఆజాద్ ఫెడరేషన్ జూలపల్లి మండల అధ్యక్షులుగా వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన వోడ్నాల తిరుపతి ని నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్,జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు, పెద్దపల్లి పట్టణంలో నందన గార్డెన్ లో జరిగిన సమావేశంలో ఈ నియామకాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా బీసీల హక్కుల సాధన కోసం గ్రామ గ్రామాన ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రానున్న రోజుల్లో బీసీల మహా పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికల భాస్కర్, రాష్ట్ర కోఆర్డినేటర్ పంజాల రేవంత్, పొన్నం ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియామకమైన సభ్యుడు వోడ్నాల తిరుపతి మాట్లాడుతూ..తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన వ్యవస్థాప అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికల భాస్కర్, కరీంనగర్
జిల్లా ఇన్చార్జి చిలకమారి శ్రీనివాస్, రాష్ట్ర కోఆర్డినేటర్ రేవంత్ లకు కృతజ్ఞతలు తెలిపారు.