పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం రైతాంగం ఏలేరు ప్రాజెక్ట్ వల్ల అతివృష్టి ,అనావృష్టి బారిన పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మునుపెన్నడూ లేని విధంగా రెండవ పంట అయిన దాలవాకి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యక్షంగా 27వేల ఎకరాలకు… పరోక్షంగా 16వేల ఎకరాలకు సకాలంలో నీరు అందిస్తున్న ఘనత పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వూటా నానిబాబు (ఆదివిష్ణు) అన్నారు. ఏలేరు కాలువల మరమ్మత్తులు సత్వరమే చేయించడం పై ఆయనకు ఉన్న సంకల్పం రైతాంగానికి ఒక వరం అని తెలిపారు.ప వన్ కళ్యాణ్ మన ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం అని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.