పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పిఠాపురం పట్టణం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వ పాఠశాల, కళాశాలల క్రీడా స్థలంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఆర్గనైజర్ డి.భద్రరావులు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి విచ్చేసే భక్తులకు వినోదం కోసం ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించామన్నారు. ఈ ఎగ్జిబిషన్ 40 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో జెయింట్ విల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, రైఫిల్ షూటింగ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు, చిన్నపిల్లలకు ఉపయోగపడే పలు స్టాళ్లను, అదే విధంగా ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సూరవరపు సురేష్, బొజ్జా లోవరాజు, కోలా దుర్గా, డా. వరలక్ష్మి, పిల్లా రమ్యజ్యోతి, కమల, టైల్స్ బాబీ తదితరులు పాల్గొన్నారు.
