విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ పాల్గొన్నారు.

previous post
next post