మహిళల రక్షణకు చట్టాలు ఉన్నాయని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్,జూనియర్ సివిల్ జడ్జి భవ్య లు అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ కోర్టు హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. మహిళల పట్ల అఘాయిత్యాలు జరగకుండా వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలన్నారు. సమాజ సంక్షేమం సమాజ గమనం స్త్రీ తోనే ముడిపడి ఉందన్నారు. మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి అధ్యక్షతన జూనియర్ సివిల్ జడ్జి భవ్య కు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కే మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి, ధనలక్ష్మి హేమలత రమాదేవి రజని బాదేదుర్గ శిల్పా సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు పాలేటి నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య,ఉయ్యాల నరసయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు……..