Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆవిర్భావ సభ భద్రత ఏర్పాట్లుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష

జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో కలసి సభా ప్రాంగణం పరిశీలన

 

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. సోమవారం సాయంత్రం చిత్రాడ దగ్గర సభా స్థలిని పరిశీలించారు. సభకు తరలి వచ్చే లక్షలాది కార్యకర్తలు, అభిమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపులు, నిర్దేశిత పార్కింగ్ స్థలానికి వాహనాలు తేలికగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ చేస్తున్న ఏర్పాట్లను అధికారులకి తెలియచేశారు. అనంతరం ప్రధాన వేదిక, డీ జోన్, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వీఐపీ గ్యాలరీలను పరిశీలించారు. సభా ప్రాంగణంలోనూ, హైవే వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు పై చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసనసభ్యులు పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు తదితరులు పాల్గొన్నారు

.

Related posts

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

TNR NEWS

వసుంధర తేజం గోవిందనామం – శ్రీవారిభక్తులతో గణపతిపీఠం లో73వ జపయజ్ఞ పారాయణ

Dr Suneelkumar Yandra

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

Dr Suneelkumar Yandra

చారిత్రక కాకినాడ పురపాలక భవనాన్ని పరిరక్షించాలి – పౌర సంక్షేమ సంఘం వినతి

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*

TNR NEWS