- పిఠాపురం జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో గ్రామంలో మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభను దిగ్విజయంగా నిర్వహించేందుకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు పర్యటించి ప్రజలందరికి ఆహ్వానం పలికే కార్యక్రమం నిర్వహించారు. అలానే సమన్వయ కర్తలుగా జనసేన ఆవిర్భావ సభ కమిటీకు ఇన్చార్జిగా పి.వి.ఎస్ రాజు మరియు దాసరి రాజు లని నియమించడం జరిగింది. అందులో భాగంగా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో పర్యటించి అక్కడి వారి అందర్నీ ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా పిఠాపురం జనసేన పార్టీ బీసీ నాయకులు నక్క బద్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క నారాయణమూర్తి, జోడా శ్రీను, వారికి మద్దతుగా జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.