Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు చేరువగా ఉండి ప్రభుత్వ పధకాలను అందించడంలో భాద్యత తీసుకోవాలి

  • కూటమి పార్టీలతో ఎటువంటి సమస్యలు రాకుండా సమన్వయంతో వ్యవహరించాలి

 

  • పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ నభూతో నభవిష్యతి

 

  • పిఠాపురం నియోజకవర్గ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా పనిచెయ్యడం చోడవరం జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గుర్తింపు

 

చోడవరం : చోడవరం నియోజకవర్గం బుచ్య్యపేట మండల నాయకులతో చోడవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు సమావేశం అయ్యారు. ప్రభుత్వ పధకాలు, అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణం, మంగళాపురం ఆనకట్ట, వడ్డాది, విజయరామరాజు పేట వంతెనల నిర్మాణం, చెరకు రైతులు పడుతున్న ఇబ్బందులు గూర్చి సుధీర్గంగ చర్చించారు. కూటమి పార్టీలతో ఎటువంటి సమస్యలు రాకుండా సమన్వయంతో వ్యవహరించాలి అని గ్రామ మండల స్థాయిలో ప్రజోపయోగ పనులు చెయ్యడానికి అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. సబ్సిడీ రుణాలు గూర్చి సంబంధిత వర్గాలకు అవగాహన కల్పించాలని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పధకంలో చేపట్టబోయే పనులనందు గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి సంబంధిత అధికారులకు అందించాలని నిర్ణయించారు. చోడవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ నభూతో నభవిష్యతి  అన్న చందాన జరిగింది అని, ఈ సభ జనసేన పార్టీ యొక్క ప్రజా బలాన్ని చాటి చెప్పిందని, సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక విలక్షణమయిన నేతగా, ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా పనిచెయ్యడం పార్టీ చోడవరం జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు – కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు

Dr Suneelkumar Yandra

జాతీయ మహిళా కమిషన్ కొత్త ఛైర్ పర్సన్ గా విజయా కిశోర్

TNR NEWS

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

Dr Suneelkumar Yandra

రోలుగుంట మండలం రాజన్నపేట క్వారీ పై అధికారుల విచారణ

Dr Suneelkumar Yandra

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

TNR NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా